Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Spain Masters:  పివి సింధు రన్నరప్

Spain Masters:  పివి సింధు రన్నరప్

భారత స్టార్ షట్లర్ పివి సింధు మాడ్రిడ్ లో జరుగుతోన్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్స్ లో ఓటమి పాలైంది. ఇండోనేషియా ప్లేయర్  జార్జియా మరిస్క తున్ జింగ్ 21-8; 21-8 తేడాతో సింధుపై విజయం సాధించింది. సెమీస్ లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్ పై 24-22; 22-20తో,  క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్ ఫెల్ద్ట్ పై 21-14;21-17 తేడాతో సింధు గెలుపొందింది.

గత ఏడాది ఆగస్ట్ లో జరిగిన బర్మింగ్ హామ్ లో మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన తర్వాత గాయం కారణంగా కొన్నాళ్ళు ఆటకు దూరమైన సింధు ఈ ఎడాది ఇప్పటివరకూ జరిగిన బిడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో అంతగా రాణించలేకపోయింది. తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. మార్చి చివరి వారంలో ముసిగిన స్విస్ ఓపెన్ లో మాత్రం రెండో రౌండ్ లో నిష్క్రమించింది.

ఈ స్పెయిన్ ఓపెన్ లో సత్తా చాటి ఫైనల్స్ కు చేరుకున్న సింధు రెండో స్థానంలో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్