Saturday, April 20, 2024
Homeసినిమావ్యవసాయం పండుగ అనే రోజు రావాలి : ఆర్. నారాయణమూర్తి

వ్యవసాయం పండుగ అనే రోజు రావాలి : ఆర్. నారాయణమూర్తి

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, త్వరలో రిలీజ్ కానుంది. రైతు నాయకులు ఈ సినిమాను ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి శ్వరారావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్ , ఎంఎల్ సి గోరటి వెంకన్న, కవి అందెశ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ…”సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఈ సినిమాలో ఎస్పీ బాల సుబ్రమణ్యం గారు, వంగపండు ప్రసాద్రావు గారు పాటలు పాడారు. వారికి నా నివాళులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని రైతన్న సినిమా తీశాను” అన్నారు.

“ఈ చిత్రం ద్వారా చెప్పే విషయం ఏమిటంటే… నేటి రైతు పరిస్థితి గురించి. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?. రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు…ఆ నానుడి ఏమైంది. ఆ రైతు ఎక్కడున్నాడు. అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు ఈరోజు?. చాలా బాధాకరంగా వుంది రైతు పరిస్థితి. ఎందుకంటే.. రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక తన అప్పులు తీర్చుకో లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు. అలా రాకూడదు. రైతు ఆత్మ హత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర కావాల”న్నారు.

డాక్టర్ స్వామి నాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. వ్యవసాయం దండగ కాదు పండుగనే రోజు రావాలని అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రమే ఈ రైతన్న”  అని నారాయణ మూర్తి వివరించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్