రజినీకాంత్ ‘పెద్దన్న’ నుంచి ‘రా సామీ’ పాట విడుదల

Raa Saami Song From Peddanna Is Released :

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం పెద్దన్న. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ మోడ్‌లో రజినీని చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్‌ లా అనిపించింది. ఇప్పుడు ‘రా సామీ’ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇది పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ ను టార్గెట్ చేసేలా ఉంది. ఇందులో రజినీ పాత్ర తీరును వివరించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈపాట ఫుల్ ఎనర్జీతో ఉంది. ముఖేష్, అతని బృందం అద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్ తన స్టైల్లో మాస్ యాంగిల్‌లో ఈ పాటను రాశారు.

పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న భారీగా విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. నయన తార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Must read : రజినీకాంత్ పెద్దన్న ట్రైలర్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *