Saturday, January 18, 2025
Homeసినిమారాధేశ్యామ్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో?

రాధేశ్యామ్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో?

What Next? జిల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రాధాకృష్ణ తొలి ప్ర‌య‌త్నంలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా సినిమాని బాగా తీశాడనే పేరు తెచ్చుకున్నాడు. అందుక‌నే రెండో సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ తీసే అద్భుత అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. యు.వి. క్రియేష‌న్స్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత భారీగా రూపొందించింది. అయితే.. రాధేశ్యామ్ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది.

అయితే.. ఈ మూవీ ఫ్లాప్ తర్వాత రాధాకృష్ణ ఎక్కడా కనిపించలేదు. కనీసం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తదుపరి చిత్రం పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. రాధాకృష్ణ తన మూడో చిత్రాన్ని గోపీచంద్ తో చేయాలనుకుంటున్నార‌ట‌. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ను తయారు చేసి.. గోపీచంద్ కు వినిపించారట.

అది విన్న ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని.. కానీ సినిమాకు సైన్ చేయడానికి కాస్త టైమ్ కావాలని గోపీచంద్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ ప్రాజెక్ట్ ను కూడా యూవి క్రియేషన్స్ వారే నిర్మించేందుకు రెడీగా ఉంద‌ట‌. మ‌రి.. గోపీచంద్.. రాధాకృష్ణ‌కు ఎస్ చెబుతారో..?  నో చెబుతారో..?  చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్