Tuesday, April 16, 2024
Homeసినిమామ‌హేష్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ రాధ?

మ‌హేష్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ రాధ?

Radha is back?: సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేష‌న్లో రూపొందిన ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ చిత్రాలు ప్రేక్షకుల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం తెలిసిందే. దీంతో వీరిద్దరి మూడో సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. మ‌హేష్‌, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేష‌న్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల ఈ మూవీ ప్రారంభోత్సవం సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్ గా జ‌రిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో మ‌హేష్ బాబు త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్ రాధ న‌టించ‌నున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పటి హీరోయిన్స్ కి అమ్మ‌, అత్త పాత్రలు ఇవ్వడం త్రివిక్రమ్ కి ఆచారంగా వ‌స్తోంది.

ఇప్పటికే సీనియ‌ర్ హీరోయిన్స్ అయిన‌ నదియా, టబు, ఖుష్బూ ల‌కు ఆయన సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించే అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు వారి లిస్ట్ లోకి రాధ కూడా చేరనుంద‌ని వార్తలు రావ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ‌, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ త‌దిత‌రుల చిత్రాల్లో రాధా న‌టించింది. ఆమె కుమార్తెల‌ను క‌ధానాయిక‌లుగా ప‌రిచ‌యం చేయ‌డం కూడా జ‌రిగింది. ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సివుంది.

Also Read : మ‌హేష్ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్