Wednesday, March 26, 2025
Homeసినిమారాధే శ్యామ్ సైతం వాయిదా!

రాధే శ్యామ్ సైతం వాయిదా!

Radheshyam Postponed: సంక్రాంతి బరి నుంచి మరో భారీ సినిమా తప్పుకుంది. ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’  విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం రాధే శ్యామ్ జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. ఓమిక్రాన్ కేసుల పెరుగుదలతో, తప్పనిసరి పరిస్థితుల్లో విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రభాస్ ను భేషరతుగా ప్రేమిస్తున్న అభిమానులందరికీ యూనిట్ ధన్యవాదాలు తెలియజేసింది.

సినిమా విడుదలకు యూనిట్ అహర్నిశలూ ప్రయత్నాలు చేస్తోందని, కానీ కోవిడ్ మూడో దశ, ఓమిక్రాన్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ సినిమా ప్రేమ, మజిలీ కి సంబంధించినదని, ఇదే కోవలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అభిమానుల ప్రేమ, సహకారంతో ధైర్యంగా ఎదుర్కొంటామని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

Also Read : ఇట్స్ అఫిషియ‌ల్.. ఆర్ఆర్ఆర్ వాయిదా

RELATED ARTICLES

Most Popular

న్యూస్