Sunday, January 19, 2025
Homeసినిమాఅంచనాలు పెంచిన రాధేశ్యామ్ టీజర్

అంచనాలు పెంచిన రాధేశ్యామ్ టీజర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పిరియాడిక్ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హేగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాధేశ్యామ్ నుంచి విక్రమాదిత్య ఎవరనే విషయాన్ని తెలియజేస్తూ.. పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఒకే భాషలో ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఈ టీజర్ విషయానికి వస్తే.. ‘నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు.. కానీ నీకు ఏది చెప్పను.. ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు.. నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రేమకథ మాత్రమే కాదు.. అంతకు మించి ఏదో ఉంది అనిపిస్తుంది.

ఇంకా చెప్పాలంటే.. సైన్స్ కి, జ్యోతిష్యానికి లింక్ చేస్తే ఓ అద్భుత ప్రేమకథ ఈ రాధేశ్యామ్ అనిపిస్తుంది. ఈ టీజర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ను సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్ధాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్