తెలంగాణలో దుర్మార్గం చెల్లదని, ఈరోజు మీరు నన్ను సింగాపూర్ లో అడ్డుకోవచ్చు కానీ, మేము తలుచుకుంటే ఎక్కడా అడుగుపెట్టలేరని ఈటెల రాజేందర్ విమర్శించారు. నా మీటింగ్ కు రావొద్దని బెదిరిస్తున్నారు.. తెలంగాణ నీ అబ్బ జాగీరా కెసిఆర్ అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ.. ప్రజల జాగీరు. కెసిఆర్ ఓనర్ కాదు కాపలాదారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగపూర్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కెసిఆర్ కు దళితుల మీద ప్రేమ ఉంటే దళితబందు మీద కలెక్టర్ల , బ్యాంక్ మేనేజర్ పెత్తనం ఉండవద్దని ఈటెల రాజేందర్ అన్నారు. దళిత బంధు మీద బీజేపీ కేసు వేసిందని దొంగ లేఖలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రమాణం చేద్దాం పోచమ్మ గుడికి రమ్మంటే ఎవడూ రాలేదన్నారు. అనుమతుల పేరుతో పోలీసులు దీనిపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తానన్ని ఈటెల చెప్పారు.

నన్ను వెన్నుపోటు పొడిచి బయటికి పంపించింది కెసిఆర్ అని, దమ్ముంటే రాజీనామా చెయ్యి అంటే చేశానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. దమ్ముంది కాబట్టి రాజీనామా చేసిన అన్నారు. ఇతర పార్టీల వారిని  తీసుకువచ్చి మంత్రులను చేసింది కెసిఆర్ అని తెలంగాణ వ్యతిరేకించిన వారిని అందలం ఎక్కించిన కెసిఆర్ సిగ్గుతో తలదించికో హితవు పలికారు. కెసిఆర్ నన్ను 18 సంవత్సరాలు ఉద్యమంలో వాడుకొని తెలంగాణ వచ్చిన తరువాత బయటికి పంపించిండని, తెరాస వారు నీతి జాతి లేకుండా తయారు అయ్యారని ఈటెల ఆరోపించారు. మేము ఎవరి జోలికి పోము, మా జోలికి ఎవరు రావద్దు. వస్తే ఊరుకోమని ఈటెల స్పష్టం చేశారు.

ఎన్నికల తరువాత సిద్దిపేటకు వస్తానని, మీ సత్తా ఏంది నా సత్తా ఏంది తేల్చుకుందామని ఈటెల రాజేందర్ మంత్రి హరీష్ రావుకు సవాల్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే తెరాస అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని ఈటెల అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *