To Create History: స్పెయిన్ కు చెందిన టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ చరిత్ర సృష్టించేందుకు కేవలం మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నేడు జరిగిన సెమీ ఫైనల్లో ఇటలీ క్రీడాకారుడు ఏడో సీడ్ బెరేటినీపై 6-3; 6-2; 3-6, 6-3 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టాడు.ఎల్లుండి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో నాదల్ విజయం సాధిస్తే 21 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం 20 టైటిల్స్ సాధించి నోవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ సరసన ఉన్న నాదల్ ఈ టైటిల్ గెలిస్తే టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నట్లు అవుతుంది. టాప్ సీడ్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరం కాగా, ఫెదరర్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీనితో నాదల్ కు ఈ సువర్ణ అవకాశం లభించింది.
నాదల్ ఎల్లుండి విజేతగా అవతరిస్తే మరో రికార్డును కూడా సొంతం చేసుకోబోతున్నాడు. అన్ని అన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కనీసం రెండు సార్లు గెల్చుకున్న నాలుగో ఆటగాడిగా జకోవిచ్, రాయ్ ఎమర్సన్, రాడ్ లేవర్ ల సరసన నిలవబోతున్నాడు.
నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ కు చేరడం ఇది ఆరోసారి. నాదల్ 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెల్చుకున్నాడు. ఆ తర్వాత 2012, 2014 2017, 2019 సంవత్సరాల్లో ఫైనల్ కు చేరుకున్నప్పటికీ విజయం సాధించలేదు.
Also Read : ఇక ఆడలేను