Tough Fight: రష్యన్ ఆటగాడు మెద్వదేవ్ ఆస్ట్రేలియన్ ఫైనల్లో అడుగు పెట్టాడు. నేడు జరిగిన సెమీఫైనల్లో గ్రీస్ ఆటగాడు, నాలుగో సీడ్ సిట్సిపాస్ పై 7-6;4-6; 6-4; 6-1 తేడాతో విజయం సాధించాడు. ప్రస్తుతం రెండో సీడ్ ఆటగాడు మెద్వదేవ్ గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఫైనల్ కు చేరుకున్నాడు కానీ జకోవిచ్ చేతిలో 7-5;6-2;6-2 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ ఓటమికి ప్రతీకారం సెప్టెంబర్ లో జరిగిన యూఎస్ ఓపెన్ లో తీర్చుకున్నాడు. 6-4;6-4;6-4 తో జకోవిచ్ ను ఓడించి టైటిల్ గెల్చుకున్నాడు.
ఎల్లుండి, ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఫైనల్ లో రాఫెల్ నాదల్ తో మెద్వదేవ్ తలపడనున్నాడు.
Also Read :చరిత్రకు అడుగు దూరంలో నాదల్