Monday, June 8, 2026
Homeసినిమాకృష్ణంరాజు చివరి చూపుకు నోచుకోలేకపోయా: లారెన్స్ ఎమోషన్

కృష్ణంరాజు చివరి చూపుకు నోచుకోలేకపోయా: లారెన్స్ ఎమోషన్

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి విషయాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రెబల్ అనే సినిమా రూపొందించిన  రాఘవ లారెన్స్  తన  సంతాపం వ్యక్తం చేశారు.

ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా  పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.  ఈ సమయంలో తాను ఇక్కడ లేనని, ఆయన్ను కడసారి చూసుకోలేక పోవడం తన  దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.  కృష్ణంరాజు గారి లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ అభిప్రాయపడ్డారు.

Also Read : 

తెలుగు తెరపై నిలువెత్తు నిండుదనం .. కృష్ణంరాజు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular