Tuesday, June 16, 2026
HomeసినిమాRaghava Lawrence: అభిమాని రిక్వెస్ట్ తో స్పీడ్ పెంచుతున్న లారెన్స్! 

Raghava Lawrence: అభిమాని రిక్వెస్ట్ తో స్పీడ్ పెంచుతున్న లారెన్స్! 

కోలీవుడ్ స్టార్ హీరోలలో కొందరు టాలీవుడ్ లో తమ సినిమాలకి ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ ఇక్కడ కొరియోగ్రఫర్ గా క్రేజ్ తెచ్చుకున్న లారెన్స్, ఆ తరువాత హీరోగా అంతకంటే ఎక్కువ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హారర్ కామెడీ జోనర్లో వరుస సినిమాలు చేస్తూ, భారీ విజయాలను దక్కించుకున్నాడు. మళ్లీ ఆయన నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందని ఇక్కడి ఆడియన్స్ వేచి చూసే పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘రుద్రుడు’ ఈ నెల 14వ తేదీన ‘శాకుంతలం’ సినిమాతో పోటీపడటానికి రెడీ అవుతోంది. నిజానికి లారెన్స్ నుంచి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన గ్యాప్ రావడానికి గల కారణాలను వివరించాడు. కావాలని చెప్పి తాను గ్యాప్ తీసుకోలేదనీ, అనుకోకుండానే అలా జరిగిపోయిందని అన్నాడు. ఇకపై అలా జరగదనీ, అందుకు ఒక కారణం ఉందని అన్నాడు.

ఒక రోజున తాను రాఘవేంద్రస్వామి గుడికి వెళ్లి వస్తుండగా, ఒక అభిమాని వచ్చి కాళ్లపై పడ్డాడనీ, ఏదైనా అవసరంతో వచ్చాడేమోనని అనుకున్నానని లారెన్స్  అన్నాడు. తన నుంచి ఏడాదికి మూడు సినిమాలు రావలసిందేనని ఆ అభిమాని కోరాడని చెప్పాడు. కనీసం రెండు సినిమాలైనా చేయవలసిందేనని ఎమోషనల్ అయ్యాడని అన్నాడు. అలాంటి అభిమానుల కోసం ఇకపై స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అభిమాని కోరికతో అలా ఫిక్స్ అయిన లారెన్స్, ఇకపై గ్యాప్ లేకుండా .. రాకుండా దుమ్మురేపేస్తాడన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular