Saturday, January 18, 2025
HomeసినిమాChandramukhi 2: రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2' విడుదల వాయిదా.?

Chandramukhi 2: రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’ విడుదల వాయిదా.?

రాఘవ లారెన్స్, కంగనా ర‌నౌత్ న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్  28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రముఖి 2  చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు.

ముందుగా ‘చంద్రముఖి 2’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయటం లేదని, సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

రీసెంట్‌గా రిలీజైన చంద్రముఖి 2 ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. 17 సంవత్స‌రాల క్రితం లక లక అంటూ చంద్ర‌ముఖి తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి చంద్రముఖి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్