Sunday, January 19, 2025
Homeసినిమాదర్శకేంద్రుడి చేతుల మీదుగా ‘బ్రిలియంట్ బాబు S/O తెనాలి’ ఫస్ట్ లుక్

దర్శకేంద్రుడి చేతుల మీదుగా ‘బ్రిలియంట్ బాబు S/O తెనాలి’ ఫస్ట్ లుక్

Brilliant Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు.

ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా, DSR సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మ‌రి.. బ్రిలియంట్ బాబూ ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్