Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్‘పరిమిత’ కోచ్ గా ద్రావిడ్

‘పరిమిత’ కోచ్ గా ద్రావిడ్

భారత క్రికెట్ పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యారు. జులైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించి 3 వన్డేలు, 3 టి-20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ టీమ్ కు కోచ్ గా ద్రావిడ్ వ్యవహరిస్తారు. అదే సమయంలో విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లో న్యూజీలాండ్ తో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఆగష్టు లో అక్కడే ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడనుంది.

దీనితో వన్డేలు, టి-20 లకు ఒక జట్టును, టెస్ట్ మ్యాచ్ లకు మరో జట్టును వేర్వేరుగా ఎంపిక చేశారు. శ్రీలంకతో సిరీస్ కు ద్రావిడ్ ను విడిగా ఎంపిక చేశారు. టెస్ట్ జట్టుతో ప్రధాన కోచ్ రావిశాస్త్రి కొనసాగుతారు. నేషనల్ క్రికెట్ అకాడెమీ బాధ్యతలు దావిడ్ నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీలంకతో ఆడే భారత జట్టును ఈ నెలాఖరుకు ప్రకటిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్