Tuesday, March 17, 2026
HomeTrending Newsసిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

సిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన pcc కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ప్రణాలికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించి..  అక్కడే నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్ గాంధి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధి సభ తేదీ ఈ నెలాఖరు లోపు ఖరారు చేయనున్నారు.

బిజెపి అగ్రనేతలు తెలంగాణపై ఎన్నడూ లేని విధంగా ఫోకస్ చేసి వరుస పర్యటనలు చేస్తుండటంతో.. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే గత నెలలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరై.. రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. రాహుల్ గాంధీ వచ్చి వెళ్లిన తరువాత బీజేపీ ఢిల్లీ పెద్దలు అనేకసార్లు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీని మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు తెలంగాణ పిసిసి ప్లాన్ చేసింది. వచ్చే నెలలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మంత్రి కేటిఆర్  ప్రాతినిధ్యం వహిస్తున్నసిరిసిల్ల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular