Sunday, January 19, 2025
HomeTrending Newsరాహుల్ గాంధి పర్యటన షెడ్యుల్ ఖరారు

రాహుల్ గాంధి పర్యటన షెడ్యుల్ ఖరారు

AICC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదిన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి  రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ కు పయనమవుతారు. తెలంగాణ పిసిసి అధ్వర్యంలో జరిగే వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య నాయకులకు ఒకే వేదిక…ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు.

వరంగల్ రైతు సంఘర్షణ సభలో సాయంత్రం 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగాలు ఉంటాయి. 7 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభం అవుతుంది. బహిరంగ సభ తరువాత రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకోనున్న రాహుల్ గాంధీ..దుర్గం చెరువు పక్కన ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్లో రాత్రి బస చేస్తారు. 7 వ తేదీ ఉదయం హోటల్ కోహినూర్ లో ముఖ్య నాయకులతో అల్పాహారం తీసుకొని, అక్కడి నుండి మొదట సంజీవయ్య పార్క్ కి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కు నివాలి అర్పిస్తారు. అక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ కు చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడ దాదాపు 300 మంది ముఖ్య నాయకుల తో సమావేశం అవుతారు. డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలెర్స్ తో ఫొటో సెషన్ ముగిశాక ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ మద్యాహ్నం సమావేశమై వారితో కలిసి భోజనం చేస్తారు. అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఢిల్లీ కి రాహుల్ గాంధికి తిరుగు ప్రయాణం అవుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్