Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్ఢిల్లీపై లక్నో గెలుపు

ఢిల్లీపై లక్నో గెలుపు

LSG going: ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 6 పరుగులతో విజయం సాధించింది. లక్నో విసిరిన 196 పరుగుల లక్ష్య సాధనలో ఢిల్లీ 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటి 51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, 42 పరుగులకు తొలి వికెట్ (డికాక్ 23) కోల్పోయింది. రెండో వికెట్ కు కెప్టెన్ రాహుల్-దీపక్ హుడా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీపక్ హుడా 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. జట్టు స్కోరు 176 వద్ద రాహుల్ ఔటయ్యాడు.  మార్కస్ స్టోనిస్-17; క్రునాల్ పాండ్యా­-9 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ మూడు వికెట్లూ ఢిల్లీ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కే దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 13 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి (పృథ్వీ షా-5; వార్నర్-3) వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్-37; కెప్టెన్ రిషభ్ పంత్-44;పావెల్- 35; పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ నాలుగు; దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

నాలుగు వికెట్లు పడగొట్టిన మోసిన్ ఖాన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : కోల్ కతాపై ఢిల్లీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్