Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: పంజాబ్ పై గుజరాత్ అద్భుత విజయం

ఐపీఎల్: పంజాబ్ పై గుజరాత్ అద్భుత విజయం

What a Match: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గుజరాత్ 6 వికెట్లతో అద్భుత విజయం సాధించింది. తెవాటియా చివరి బంతిని సిక్సర్ గా మలిచి ఐపీఎల్ మజా రుచి చూపించాడు.

చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు కావాల్సిన తరుణంలో ఓడియన్ స్మిత్ వేసిన తొలి బంతి వైడ్, తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. రెండో బంతికి తెవాటియా సింగిల్, మూడో బంతికి మిల్లర్ ఫోర్, నాలుగో బంతికి మిల్లర్ సింగిల్ సాధించారు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన తరుణంలో తెవాటియా రెండు బంతులనూ రెండు సిక్సర్లు బాది  జట్టుకు హ్యాట్రిక్ విజయం అందించాడు. గుజరాత్ జట్టులో శుభమన్ గిల్ 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సాయి సుదర్శన్ 35, కెప్టెన్ హార్దిక్ పాండ్యా  27 పరుగులతో విజయంలో తమవంతు పాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో రబడ రెండు, రాహుల్ చాహర్ ఒక వికెట్ సాధించారు.

ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ 11 పరుగుల వద్ద తొలి వికెట్ (కెప్టెన్ మయాంక్ అగర్వాల్- 5) కోల్పోయింది. బెయిర్ స్టో కూడా నిరాశ పరిచి 8పరుగులే చేసి ఔటయ్యాడు. శిఖర్ ధావన్- లివింగ్ స్టోన్ కలిసి మూడో వికెట్ కు 52 పరుగులు జోడించారు. ధావన్ 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో జితేష్ శర్మ-లివింగ్ స్టోన్ తన ప్రతాపం చూపారు, వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. 11 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లతో 23 పరుగులు చేసి జితేష్ అవుట్ కాగా, లివింగ్ స్టోన్ కేవలం 27 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లతో 64పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఒకానొక దశలో 200 మైలురాయిని అధిగమిస్తుందనుకున్న పంజాబ్ వరుస వికెట్లు కోల్పోయింది. షారుఖ్ ఖాన్(15); చివర్లో రాహుల్ చాహర్(22), ఆర్ష దీప్ సింగ్(10) వేగంగా పరుగులు రాబట్టడంతో పంజాబ్ నిర్ణీత 20 9 189 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు; దర్శన్ నల్ఖండే రెండు; షమీ, హార్దిక్, ఫెర్గ్యుసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

శుభమన్ గిల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: ఢిల్లీ పై లక్నో విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్