Rahul to Chanchalguda: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి… జైలులో శిక్ష అనుభవిస్తున్న NSUI నేతలను పరామర్శించనున్నారు. రాహుల్ గాంధీతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలకు జైలులో విద్యార్ధి నేతలను కలుసుకునేందుకు తెలంగాణా జైళ్ళ శాఖ అనుమతి మంజూరు చేసింది, ఈ విషయాన్ని జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ వెల్లడించారు. 1.05 నుంచి 1.30 నిమిషాల మధ్యలో రాహుల్ ములఖత్ కు అనుమతించినట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటనలో భాగంగా తొలుత దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాలులర్పిస్తారు. అనతరం చంచల్ గూడ కు వెళతారు. అక్కడినుంచి గాంధీభవన్ కు చేరుకొని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.  ఆ తర్వాతా పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ఎన్రోల్ మెంట్ లో కీకకంగా వ్యవహరించిన నేతలతో ఫోటో సెషన్ ఉంటుంది. సాయంత్రం ఢిల్లీ కి తిరుగు పయనమవుతారు.

Also Read :తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *