Sunday, January 19, 2025
Homeసినిమాఅల్లు అర్జున్ తో రాజ‌మౌళి భారీ పాన్ ఇండియా మూవీ?

అల్లు అర్జున్ తో రాజ‌మౌళి భారీ పాన్ ఇండియా మూవీ?

Bunny-Jakkana Comobo: బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి చ‌రిత్ర సృష్టించారు. ఈ సినిమా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డులు అన్నింటిని క్రాస్ చేసి క‌నీవినీ ఎరుగ‌ని స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో రాజ‌మౌళితో ఒక్క సినిమా అయినా.. లేదా ఒక్క సీన్ లో అయినా స‌రే.. న‌టించాల‌ని స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ లు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఈనెల 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నారు. ఎప్ప‌టి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్త‌ల్లో ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ల‌నుంది అనేది క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాబుతో సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.
ఈ వార్త గ‌తంలో వినిపించింది. అయితే.. ఈ మ‌ధ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలిసింది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రాజ‌మౌళి మ‌గ‌ధీర సినిమా చేశారు. అప్ప‌టి నుంచి అల్లు అర‌వింద్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింద‌ని.. రాజ‌మౌళి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పార‌ని వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్