Sunday, March 15, 2026
Homeసినిమారాజశేఖర్ భుజాలపైనే పూర్తి బాధ్యత పెట్టేసిన 'శేఖర్' 

రాజశేఖర్ భుజాలపైనే పూర్తి బాధ్యత పెట్టేసిన ‘శేఖర్’ 

Sekhar: రాజశేఖర్  కి మొదటి నుంచి ఇటు యాక్షన్ హీరోగానూ ఫ్యామిలీ హీరోగా ను మంచి పేరు ఉంది. చాలా అరుదుగా మాత్రమే వచ్చే ఈ క్రేజ్ ను ఆయన ఇంతవరకూ నిలబెట్టుకుంటూనే వచ్చారు. ఇక మొదటి నుంచి  కూడా ఆయనను నిలబెడుతూ వచ్చినవి పోలీస్ పాత్రలే. అలా ఈ సారి కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే  ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆయనను ఆ లుక్ తో థియేటర్లకు తీసుకుని వస్తున్న సినిమానే ‘శేఖర్’. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి  దర్శకత్వం చేయడమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు.

మలయాళంలో ఆ మధ్య మంచి విజయాన్ని అందుకున్న ‘జోసెఫ్’ సినిమాకి ఇది రీమేక్. ఇది ఎమోషన్స్ ప్రధానంగా  నడిచే కథ. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ .. ఆత్మీయరాజన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ ఇద్దరూ తెలుగు ఆడియన్స్ కి అంతగా తెలియదు. ఇక మిగతా పాత్రధారులు కూడా అంత బలంగా ఏమీ కనిపించడం లేదు. రాజశేఖర్ మాత్రమే నెట్టుకు రావాలి. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో శివాని కనిపించనుండటం ఒక ప్రత్యేక ఆకర్షణ గానే చెప్పుకోవాలి. మలయాళ మాతృకలో కథ కాస్త సీరియస్ గా నడుస్తుంది. తెలుగులో మాత్రం పాటలు పెట్టినట్టుగా తెలుస్తూనే ఉంది.

‘గరుడ  వేగ’లో ముందు .. ఆ తరువాత  కూడా రాజశేఖర్ కి హిట్ లేదు. ‘ గరుడవేగా’ తరువాత భారీ బాడ్జెట్ తో ఆయన ‘కల్కి’ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. ‘జోసెఫ్’ కథ రాజశేఖర్ కి బాగానే సెట్ అవుతుంది. ఇది ఆయన మార్కు సినిమానే. లుక్ పరంగా రాజశేఖర్ మంచి మార్కులు కొట్టేశాడు. మరి కథలో చేసిన మార్పులు ఎంతవరకూ కలిసొస్తాయనే దానిపైనే రిజల్ట్ ఉంటుంది. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, రాజశేఖర్ కి హీరోగాను  .. నిర్మాతగాను కీలకమనే చెప్పాలి. అందువల్లనే  ఆయన ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.

Also Read : ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా ‘శేఖర్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular