Saturday, April 20, 2024
Homeసినిమాఆడియన్స్ కు డిఫ‌రెంట్ ఫిల్మ్ ఇవ్వాలనే "శేఖర్" చేశాను : రాజశేఖర్

ఆడియన్స్ కు డిఫ‌రెంట్ ఫిల్మ్ ఇవ్వాలనే “శేఖర్” చేశాను : రాజశేఖర్

Different film: హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం శేఖ‌ర్. ఇందులో ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న ఈ శేఖ‌ర్ చిత్రం విడుద‌లైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాజశేఖర్ చెప్పిన విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

“ఇంత వరకు నా వెనక ప్రాపర్టీ ఉండేది. ఇప్పుడు అవన్నీ అప్పుల్లో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితేనే  నేను అప్పుల నుంచి బయటపడతాను. అందుకే నేను ఎప్పుడూ లేని టెన్షన్ తో  నా మనసులో నుంచి వచ్చిన మాటతో నన్ను, నా సినిమాను బతికించండి అని ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో చెప్పడం జరిగింది. ఆడియన్స్ ఎదురు చూసేలా ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇవ్వాలని ఈ కథను ఎంచుకున్నాను. ఈ సినిమా లో ఒక ఆర్టిస్ట్ గా చాలా శాటిస్ఫై అయ్యాను ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్, ఆ పరిస్థితి  క్యారెక్టర్లో చూపిస్తూ ప్రేక్షకులకు చాలా విషయాలు అర్థం అవ్వాలి. శేఖర్ ఎ మ్యాన్ విత్ ద స్కార్ అని ఉంది.ఆ స్కార్ తో ఉన్న వాడు ఎలా ఉండాలి అన్నట్టు ఈ క్యారెక్టర్  ఉండాలి.

నా గెటప్ కోసం 55 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వుండే ఈ క్యారెక్టర్ కు కొత్త లుక్ ఉంటే ఈ సినిమానే డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని.. దీంట్లో కొత్త లుక్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ వేయడం జరిగింది. ఆ గెటప్ వేసి షూటింగ్ చేసినప్పటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఈ గెటప్ సూపర్ గా ఉంది అని చెప్పడంతో నాకు ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ వున్నాను. కానీ.. ఎక్కడో భయం ఉండేది. అయితే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది

జీవిత ఈ సినిమా సెన్సార్ కొరకు వెళ్ళినప్పుడు వారు ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. దాంతో మాకు ఇంకా ధైర్యం వచ్చింది.దాంతో మేము ఈ సినిమాను కొంత మంది మా క్లోజ్ ఫ్రెండ్స్ కు చూపించడం జరిగింది. వారు సినిమా చూసి చాలా బాగుందని చెప్పడం జరిగింది. జీవిత, నేను సెట్లో వున్నప్పుడు తను ఒక డైరెక్టర్ గా, నేను ఆర్టిస్ట్ లాగే ఉంటాము. అయితే షూటింగ్ తర్వాత ఇద్దరూ క్యారెక్టర్ కోసం అప్పుడప్పుడూ డిస్కషన్ చేసుకుంటాం. తను నాతో బంగారం.. ఈ క్యారెక్టర్ లో నువ్వు ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ తగ్గిస్తే బాగుంటుందని డైరెక్షన్ చేపిస్తుంది. జీవిత  చాలా మంచి డైరెక్టర్ అందరి దగ్గర బాగా పని తీసుకుంటుంది. ప్రతి సీన్ పండిస్తుంది అందులో ఫీల్ ను సోల్ ను చెడగొట్టకుండా చాలా చక్కగా తీస్తుంది.

తలంబ్రాలు, ఆహుతి, అంకుశం మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం, ఇలా నా సినిమాలన్నీ ఎక్కువుగా రీమేక్ సినిమాలే.. రీమేక్ లో తీసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే ఒక్క “శేషు” మాత్రం పెద్ద సక్సెస్ కాలేదంటే దాని ఇమేజ్ తక్కువ చేశాం. అయితే టీవీలో మాత్రం హిట్ అయ్యింది.  జోసెఫ్ మలయాళంలో సక్సెస్ అయ్యింది. మలయాళంలో సక్సెస్ అయిన సినిమాలు చాలా చేశాను. రీమేక్ చేస్తే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అన్న అడ్వాంటేజ్ ఉంటుంది. రీమేక్ లో అందుకే జోసెఫ్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఏం చెయ్యాలో నా క్యారెక్టర్ కూడా నాకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి నటుడిగా నాకు ఈజీ అవుతుంది.

శివానీ, శివాత్మిక ఇద్దరికీ బిగినింగ్ మంచి పేరు వచ్చింది. శివాత్మిక దొరసాని సినిమా చేయడం. శివాని న‌టించిన‌ టూ స్టేట్స్ సగం వరకు అయ్యింది తర్వాత శివాని సినిమా అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రిలీజ్ అవ్వ‌డం అందరూ మెచ్చుకోవ‌డం తెలిసిందే. అలాగే శివాత్మిక కృష్ణవంశీ గారితో రంగమార్తాండ సినిమా చేస్తుంది.  ఆ సినిమాలో ఉన్న బ్రహ్మానందం, కృష్ణవంశీ, ప్రకాష్ రాజు, రమ్య కృష్ణ  వీరంతా నాకు ఫోన్ చేసి మీ ఆమ్మాయి చాలా బాగా చేస్తుంది అని మెచ్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

ఈ సినిమాలో కూతురి పాత్రకు శివాని, శివాత్మక  ఇద్దరినీ వద్దు అన్నాను. జీవిత లేదు మన ఇద్దరిలో ఒకరిని పెడితే ఆడియన్స్ కు కూతురు స్ట్రెస్ చేయడానికి మనకు ఎక్కువ టైం పట్టి ఎక్కువ సీన్స్ చేయాల్సి వస్తుంది. మన కూతురు అయితే  ప్రేక్షకులకు చూడడానికి బాగుంటుంది అని చెప్పింది. దాంతో ఈ సినిమాలో ఎవరు చేస్తారు అని ఇద్దరినీ అడగడం జరిగింది శివాత్మిక అక్క కోసం త్యాగం చేసి ఈ సినిమా శివానికి ఇవ్వడం జరిగింది.

Jeevitha Confident Sekhar Movie

ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ  సినిమాలో నా క్యారెక్టర్ ఖ‌చ్చితంగా స్మోక్ చెయ్యాలి.మ్యూజిక్ కు  స్మోక్ ముడిపడి ఉంటుంది. కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత నన్ను స్మోక్ చేయకూడదని డాక్టర్లు చెప్పారు. నువ్వు స్మోక్  చేస్తే మీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ డేంజర్ లోకి వెళ్ళిపోతారని  చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ నా క్యారెక్టర్ స్మోక్ చేయకపోతే సినిమా ఎఫెక్ట్ ఉండదు.

అయితే.. ఈ సినిమాపై కసి, పిచ్చి వల్ల నేను ఏమైనా పర్వాలేదు ఈ సినిమా బాగా రావాలి హిట్ అవ్వాలి అని మళ్లీ స్మోక్ చేసి సినిమా చేశాను. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత పెద్ద దర్శకుడితో మంచి కాంబినేషన్ లోనే ప్యాన్ ఇండియా సినిమా అనౌన్స్మెంట్ చేస్తాము. అది త్వరలో తెలియజేస్తాను. మే 20 న వస్తున్న మా సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్