Friday, March 28, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రఘురామపై త్వరలోనే స్పీకర్‌ నిర్ణయం

రఘురామపై త్వరలోనే స్పీకర్‌ నిర్ణయం

రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామన్నారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ అధినేత, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని విమర్శించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, వాలంటరీగా మెంబర్షిప్ రాఘురామ కోల్పోయినట్లు అవుతుందని చెస్తామన్నారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్ వివరించామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్