Sunday, June 14, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ విష‌యంలో త‌గ్గేదే లేదంటున్న జ‌క్క‌న్న‌

ఆర్ఆర్ఆర్ విష‌యంలో త‌గ్గేదే లేదంటున్న జ‌క్క‌న్న‌

RRR; Same date: ‘ఆర్ఆర్ఆర్’.. అభిమానులంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా…. ‘బాహుబ‌లి’ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌డం, కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు అమలు చేస్తుండడం…. ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ముంబయిలో సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఆర్‌ఆర్‌ఆర్ మ‌రోసారి వాయిదా ప‌డ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో ఈ వార్త‌లు వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ప్రముఖ బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. అది ఏంటంటే.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడటం లేదు. అనుకున్న తేదీకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నామ‌ని రాజమౌళి తనతో చెప్పినట్లు తరణ్ ఆద‌ర్శ్ తెలియ‌చేశారు. అలాగే కేర‌ళ‌లో జ‌రిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంద‌ని మ‌రోసారి ప్ర‌క‌టించారు.

Also Read : డైరెక్ట్ గా ఓటీటీలో ఆర్ఆర్ఆర్ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular