Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్ నటన గురించి జక్కన్న కామెంట్స్ వైరల్.

ఎన్టీఆర్ నటన గురించి జక్కన్న కామెంట్స్ వైరల్.

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ దేశవిదేశాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇటీవల జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తే.. అక్కడ 25 సంవత్సరాల నుంచి ఉన్న రజనీకాంత్ ముత్తు రికార్డ్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచి అందరిలో ఉత్కంఠ కలిగిస్తుంది.

అయితే.. వెరైటీ అనే హాలీవుడ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన షార్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉండడం విశేషం. ఈ షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న తొలి ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అలాగే నాటు నాటు సాంగ్ ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో స్థానం దక్కించుకుని ఆస్కార్ కి పోటీపడుతుండడం విశేషం. ఆస్కార్ కి పోటీపడిన తొలి భారతీయ పాటగా నాటు నాటు సాంగ్ చరిత్ర సృష్టించింది. ఇలా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇదంతా జక్కన్న మహిమే.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ పై రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిగా మారాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా చేసిన పాత్ర, తన పై తీసిన కొమురం భీముడో సాంగ్ తన మొత్తం సినీ కెరీర్ లోనే ఫేవరెట్ అన్నారు. ఎన్టీఆర్ కంటి కనుబొమ్మ మీద కెమెరా పెట్టినా కూడా దానితో కూడా నటించగల గొప్ప నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడారు. దీనితో ఎన్టీఆర్ పై జక్కన్న చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిమానులు.. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుండడంతో తెగ సంతోషపడుతున్నారు. మరి.. ఎన్టీఆర్ ఆస్కార్ దక్కించుకుంటాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్