Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రానుందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా టైమ్ లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌ తో మూవీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

మహేష్ లాంటి ఛరిష్మా ఉన్న స్టార్ తో రాజమౌళి సినిమా తీస్తే.. అది కేవలం స్వదేశం వరకే పరిమితం కాదు. హాలీవుడ్ రేంజులో విడుదలవుతుందనడంలో సందేహం లేదు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్‌ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు..?  బడ్జెట్ ఎంత..?  ఎలా ఉండబోతుంది..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ఇంటరాక్షన్ లో రాజమౌళి మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ… మా నాన్న(విజయేంద్ర ప్రసాద్) గారు, నేను కొన్ని నెలల క్రితం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాం. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.]

కాబట్టి నేను దీని పై పెద్దగా వెల్లడించలేను కానీ.. ఇది ఇండియానా జోన్స్ రేంజులో అడ్వంచర్స్ తో ఉంటుందని చెప్పగలను. నేను ఎప్పటి నుండో అడ్వెంచర్ థ్రిల్లర్ చేయాలనుకున్నాను. అది ఎట్టకేలకు ఇప్పుడు సాధ్యమవుతోంది అని అన్నారు. దీంతో పాటు  ఇంకో అద్భుతమైన హింట్ కూడా ఇచ్చేశాడు. ఏంటంటే.. ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసంవంతుడి కథ అని రాజమౌళి వ్యాఖ్యానించిన తీరును బట్టి ఖచ్ఛితంగా ఇది ఇండియానా జోన్స్ తరహా కథాంశంతో భారీ థ్రిల్స్ గగుర్పొడిచే బాండ్ 007 తరహా సాహసాలతో ఉంటుందని అర్థమవుతోంది. మరి.. ఈ మూవీతో మహేష్, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com