Wednesday, July 8, 2026
Homeసినిమామహేష్‌, రాజమౌళి మూవీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

మహేష్‌, రాజమౌళి మూవీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. వీరిద్దరి కాంబోలో మూవీ అని ప్రకటించినప్పటి నుంచి ఏదో రూమర్ వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమాలో మహేష్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుందని.. విలన్ గా అమీర్ ఖాన్ నటించనున్నారని వార్త ప్రచారంలోకి వచ్చింది.

తాజాగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న అధికారికంగా ప్రకటిస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మహేష్‌.. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత జనవరి నుంచి జక్కన్నతో మూవీ చేయాలి అనుకుంటున్నారు. అందుచేత మహేష్ పుట్టినరోజున అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అనేది నిజమే అనిపిస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందే ఈ చిత్రం గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆగష్టు 9న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular