8.6 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeసినిమాNani: 'దసరా'పై రాజమౌళి, ప్రభాస్ ఏమన్నారంటే....

Nani: ‘దసరా’పై రాజమౌళి, ప్రభాస్ ఏమన్నారంటే….

నేచురల్ స్టార్ నాని, మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ దసరా.  శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా నానికి మొదటి  పాన్ ఇండియా మూవీ.  అంచనాలకు తగ్గట్టుగానే దసరా చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. నాని మార్కెట్ ని డబుల్ చేసిందని చెప్పొచ్చు. నానిపై డబ్బై కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారని తెలిసినప్పుడు అందరూ పెద్ద రిస్క్ అని కామెంట్ చేశారు కానీ.. నాని నమ్మకమే నిజమైంది, సినిమా అఖండ విజయం సాధించింది.

ఈ మూవీపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందించారు… “శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా అద్భుతంగా తెరకెక్కించారు. హీరో నానితో పాటు హీరోయిన్ కీర్తి  కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు, మొత్తంగా ఇంతటి గొప్ప విజయం అందుకున్న దసరా టీమ్ కి ప్రత్యేక శుభాభినందనలు” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ  కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ కూడా దసరా సినిమాను వీక్షించి తన అభిప్రాయాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. “ఏం సినిమా… దసరా అదిరిపోయింది. ఇప్పుడే ఈ సినిమా చూశాను. హీరో నానికి అభినందనలు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. నాని, కీర్తి సురేశ్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు” అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ పోస్ట్ పై నాని స్పందించారు. “ప్రభాస్ అన్నా కృతజ్ఞతలు” అంటూ బదులిచ్చాడు. కీర్తి సురేష్‌ సైతం ప్రభాస్ స్పందనపై హర్షం వ్యక్తం చేసింది.

Also Read : ‘దసరా’ ఆనందంతో పాటు బాద్యతని పెంచింది : నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్