Saturday, March 14, 2026
Homeసినిమారాజ‌మౌళి స‌రికొత్త రికార్డ్

రాజ‌మౌళి స‌రికొత్త రికార్డ్

Rajamouli Records: బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా 10 వేల‌కు పైగా స్ర్కీన్స్ ల‌లో విడుద‌లైంది. ఈ సినిమా టాక్ డివైడ్ గా వ‌చ్చిన‌ప్ప‌టికీ… బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుద‌లైన అన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ దూసుకెళుతోంది.

ఈ చిత్రం తాజాగా మరో మైల్ స్టోన్ ను టచ్ చేసింది. ఈ సంచ‌ల‌న చిత్రం 1,100 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 తర్వాత ఇదే చిత్రం ఆ తరహా లో వసూలు చేయడం విశేషం. 5వ వారంలోనూ భారీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డంతో లాంగ్ రన్ లో ఏ తరహా లో వసూలు చేస్తుందో అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. బాహుబ‌లి 1800 కోట్లు క‌లెక్ట్ చేస్తే… ఆర్ఆర్ఆర్ 1100 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇలా 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసిన రెండు చిత్రాల‌ను అందించిన ద‌ర్శ‌కుడుగా రాజ‌మౌళి స‌రికొత్త రికార్డ్ సాధించారు.

Also Read : ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular