Sunday, January 19, 2025
Homeసినిమారాజ‌శేఖ‌ర్ చేతుల మీదుగా శేఖ‌ర్’ టీజ‌ర్

రాజ‌శేఖ‌ర్ చేతుల మీదుగా శేఖ‌ర్’ టీజ‌ర్

Sekhar Teaser:
సీనియర్ హీరో రాజశేఖర్ న‌టించిన తాజా చిత్రం ‘శేఖ‌ర్’. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ ఆధారంగా ఈ శేఖ‌ర్ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న‌ అనున సితార‌, ముస్కాన్ హీరోయిన్లుగా న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ థ్రిల్ల‌ర్ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా టీజ‌ర్ ను నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలియ‌చేస్తూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే..  ఆమ‌ధ్య కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన రాజ‌శేఖ‌ర్ ‘గ‌రుడ వేగ’ తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత న‌టించిన‌ ‘క‌ల్కి’ ఫ‌ర్వాలేదనిపించింది. దీంతో శేఖ‌ర్ మూవీతో స‌క్స‌స్ సాధించి మళ్ళీ తన మునుపటి ఫాంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇప్పుడు ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. ఈ శేఖ‌ర్ సినిమాతో రాజ‌శేఖ‌ర్ స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read  : మ‌హేష్ సినిమాలో విల‌న్ గా త‌మిళ స్టార్ హీరో?

RELATED ARTICLES

Most Popular

న్యూస్