Friday, March 29, 2024
Homeసినిమామ‌హేష్ సినిమాలో విల‌న్ గా త‌మిళ స్టార్ హీరో?

మ‌హేష్ సినిమాలో విల‌న్ గా త‌మిళ స్టార్ హీరో?

Arya as Villain:
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట ‘ సినిమా చేస్తున్నారు. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ భారీ  చిత్రం 2022లో ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు. ఈ క్రేజీ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తుంది.  ఈ సినిమా ఈపాటికే సెట్స్ పైకి రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయ్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న‌ సినిమాల్లో హీరోని ఎంత తెలివైన‌వాడిగా చూపిస్తాడో.. విల‌న్ ని కూడా అంతే తెలివైన‌వాడుగా.. బ‌ల‌వంతుడుగా చూపిస్తుంటారు. మ‌హేష్ తో చేయ‌నున్న మూవీలో కూడా విల‌న్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడ‌ట‌. మ‌రి.. ఆ విల‌న్  పాత్రను ఎవ‌రు పోషిస్తున్నారంటే.. తమిళ హీరో ఆర్య పేరు వినిపిస్తుంది. ఆర్యకి స్టోరీ.. త‌న క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే విలన్ గా చేయడానికి ఓకే చెప్పార‌ని స‌మాచారం. దీంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అత‌డు, ఖ‌లేజా చిత్రాలు చేసిన మ‌హేష్, త్రివిక్ర‌మ్ 11 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత సినిమా చేస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. ఈ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read : సంక్రాంతికి రావ‌డం ప‌క్కా.. అంటున్న‌ ‘భీమ్లా నాయ‌క్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్