Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL: బెంగుళూరు బౌలింగ్ కు రాజస్థాన్ కుదేలు

IPL: బెంగుళూరు బౌలింగ్ కు రాజస్థాన్ కుదేలు

బెంగుళూరు బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్  కుప్పకూలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇచ్చిన 172 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు 59 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ 112 పరుగుల తేడాతో రికార్డు విజయం నమోదు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యుత్తమ విజయం.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  విరాట్ కోహ్లీ 18; కెప్టెన్ డూప్లెసిస్-55; గ్లెన్ మాక్స్ వెల్-55… చివర్లో అర్జున్ రావత్-29 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా, ఆసిఫ్ చెరో రెండు; సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

మొదటి ఓవర్లోనే జట్టు స్కోరు 1 వద్ద రాజస్థాన్ వికెట్ల పతనం మొదలైంది. రెండు ఓవర్లు పూర్తయ్యే నాటికి ఏడు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కావడం విశేషం. జట్టులో సిమ్రాన్ హెట్మెయిర్ ఒక్కడే 19 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 35  పరుగులు చేసి రాణించాడు. జో రూట్ పది పరుగులు చేశాడు, వీరిద్దరూ మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జట్టులో మొత్తం నలుగురు డకౌట్ కావడం విశేషం.

బెంగుళూరు బౌలర్లు పార్నెల్ 3; కర్న్ శర్మ, బ్రెస్ వెల్ చెరో 2; సిరాజ్, మాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

పార్నెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్