Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్IPL: చెన్నై దూకుడుకు రాజస్థాన్ బ్రేక్

IPL: చెన్నై దూకుడుకు రాజస్థాన్ బ్రేక్

వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 32 పరుగులతో విజయం సాధించింది. జైపూర్ లోని మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 43 బంతుల్లో  8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. జోస్ బట్లర్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 27;  కెప్టెన్ సంజూ శాంసన్ 17 రన్స్ చేయగా…. హెట్మెయిర్ (8) విఫలమయ్యాడు. అయితే చివర్లో ధృవ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34;  పడిక్కల్ 13 బంతుల్లో 5 ఫోర్లతో 27 తో సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2;  జడేజా, మహీష్ తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.

చెన్నై తొలి వికెట్ కు (డెవాన్ కాన్వే-8) 41 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు లైఫ్ లైన్లు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ నిలదొక్కుకొని 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 47 పరుగులు చేశాడు. రెహానే-15 పరుగలు చేసి పెవిలియన్ చేరాడు. శివమ్ దుబే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో  52 రన్స్ తో రాణించాడు. అంబటి డకౌట్ కాగా… రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో… మొయిన్ అలీ, జడేజా దూకుడుగా ఆడి చెరో 23 పరుగులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా 3; అశ్విన్2; కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

యశస్వి జైస్వాల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్