Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Ashwin: చెన్నైపై రాజస్తాన్ విజయం

Ashwin: చెన్నైపై రాజస్తాన్ విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్తాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 175 పరుగులు చేయగా, చెన్నై 20 ఓవర్లకు 172 మాత్రమే చేయగలిగింది. చివరి రెండు ఓవర్లలో 40 పరుగులు అవసరం కాగా, 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి, 20వ ఓవర్లో 21 రన్స్ అవసరం కాగా మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోని ఈసారి విఫలమయ్యాడు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి రెండు బంతులూ వైడ్ లు వేసినా ఆ తర్వాత పదునైన యార్కర్లతో  చెన్నై విజయాన్ని నిలువరించాడు,

చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) విఫలం కాగా, సంజూ శామ్సన్ డకౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 52;  దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 38;  రవిచంద్రన్ అశ్విన్ 22 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 30; హెట్మెయిర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30(నాటౌట్) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. చెనై బౌలర్లలో ఆకాష్ సింగ్, తుషార్ దేశ్ పాండే, జడేజా తలా రెండు; మోయిన్ అలీ ఒక వికెట్ సాధించారు.

చెన్నై 10 పరుగుల వద్ద తొలి వికెట్ (రుతురాజ్ గైక్వాడ్-8) కోల్పోయింది. దేవాన్ కాన్వే 38 బంతుల్లో 6 ఫోర్లతో 50;  రెహానే 19 బంతుల్లో 2  ఫోర్లు, ఒక సిక్సర్ తో 31 పరుగులు చేయగా….శివమ్ దూబే (8); మోయిన్ అలీ (7);  అంబటి రాయుడు (1)  విఫలమయ్యారు. జడేజా 15 బంతుల్లో ఒక ఫర్, 2 సిక్సర్లతో 25;  ధోని 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో  32 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్ చెరో రెండు; సందీప్ శర్మ, ఆడమ్ జంపా చెరో వికెట్ పడగొట్టారు.

ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన రవిచంద్రన్ అశ్విన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్