Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

As Jailer: సూప‌ర్ స్టార్ రజినీకాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇది ర‌జినీకాంత్ 169వ చిత్రం. ఈ భారీ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ‌ నిర్మిస్తుంది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు. జైల‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేసి… అఫిషియ‌ల్ గా ఓ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. రక్తంతో ఉన్న ఓ కత్తిని వేలాడ‌దీసిన‌ట్టుగా ఈ పోస్టర్ లో చూపించారు.

దీనిని బట్టే ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ర‌జినీ నుంచి  స‌రైన సినిమా రాలేదు. దీంతో ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాలో ర‌జినీని నెల్సన్ మరింత స్టైలీష్ గా చూపించనున్నాడని సమాచారం. ఇక ర‌జినీ స‌ర‌స‌న న‌టించే కథానాయికగా ఐశ్వర్యరాయ్ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com