Sunday, June 7, 2026
Homeసినిమారకుల్ విడుదల చేసిన ‘మిస్టేక్’ మోషన్ పోస్టర్

రకుల్ విడుదల చేసిన ‘మిస్టేక్’ మోషన్ పోస్టర్

అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్టేక్’. సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏఎస్పీ మీడియా హౌస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.2 గా నిర్మిస్తోంది. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.  మిస్టేక్ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంఛ్ చేశారు.

“ మిస్టేక్ మూవీ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీన్ని నేను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ కథ గురించి విన్నాను. అందర్నీ ఆకట్టుకుని.. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా,  మిస్టేక్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు. సమీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – హరి జాస్తి, సంగీతం – మణి జెన్న, డైలాగ్స్ – శ్రీ హర్ష మండ, ఆర్ట్ – రవి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నిధి, నిర్మాత – అభినవ్ సర్ధార్, దర్శకత్వం – సన్నీ కోమలపాటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular