Saturday, July 27, 2024
Homeసినిమాచ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కాంబో భారీ మ‌ల్టీస్టార‌ర్

చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కాంబో భారీ మ‌ల్టీస్టార‌ర్

రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఇద్ద‌రూ క‌లిసి ‘ఎవ‌డు’ అనే సినిమాలో న‌టించారు. అయితే.. ఇద్ద‌రూ ఒకేసారి స్ర్కీన్ పై క‌నిపించ‌రు. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ సినిమా స‌క్స‌స్ అయ్యింది. అయితే.. మెగా అభిమానులు చ‌ర‌ణ్‌, అర్జున్ కాంబినేష‌న్లో ప‌ర్ ఫెక్ట్ మ‌ల్టీస్టార‌ర్ చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఇచ్చారు.

ఇటీవ‌ల అల్లు అర‌వింద్.. ఆలీతో స‌ర‌దాగా అనే టాక్ షోకి వెళ్లారు. ఆ టాక్ షోలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. చ‌ర‌ణ్‌, అర్జున్ కాంబినేష‌న్లో గీతా ఆర్ట్స్ లో భారీ మూవీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారు. అంతే కాకుండా.. ఆయ‌న చ‌ర‌ణ్‌, అర్జున్ అనే పేరుతో టైటిల్ కూడా రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ టైటిల్ ను రెన్యూవ‌ల్ చేయిస్తున్నాన‌ని కూడా చెప్పారు.

అల్లు అర‌వింద్ స్వ‌యంగా చెప్ప‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. అందుచేత ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే.. అదిరిపోయే క‌థ సెట్ అవ్వాలి. మ‌రి.. ఇద్ద‌రికీ ఉన్న క్రేజ్ త‌గ్గ‌ట్టుగా స్టోరీ ఎప్పుడు సెట్ అవుతుందో..?  ఈ భారీ, క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Also Read : స‌ల్మాన్ ఖాన్ కి స‌ర్ ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్న చ‌ర‌ణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్