Wednesday, June 17, 2026
Homeసినిమాబాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

ఎన్టీఆర్, రామ్ చరణ్‌.. ఈ ఇద్దరు హీరోలు ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా  అదరగొడితే… చరణ్ అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టాడు. ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్స్ అయ్యారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అదరగొట్టింది. సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా గోల్డన్ గ్లోబ్ అవార్డ్, ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది.

అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఇప్పుడు రామ్ చరణ్‌, శంకర్ తో  ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో చరణ్‌ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఈ మూవీని వాస్తవానికి 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. అదే సమయానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే, అలానే మహేష్ బాబు 28వ మూవీ.. రెండూ కూడా విడుదల తేదీని ప్రకటించి రిలీజ్ డేట్ ను కన్ ఫర్మ్ చేసుకున్నాయి.

దీంతో చరణ్‌, శంకర్ మూవీని వచ్చే సంవత్సరంలో సమ్మర్ కానుకగా మార్చి చివర్లో రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తోందట యూనిట్. ఇక మరో వైపు ఎన్టీఆర్ తో కొరటాల శివ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో ఆలోచనలో పడ్డ  గేమ్ చేంజర్ మేకర్స్ , ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి రెండు వారాలు గ్యాప్ ఉండేలా మార్చి 20న తమ సినిమాని పక్కాగా రిలీజ్ చేయడమే బెటర్ అని భావిస్తున్నారని సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే.. రెండు వారాల గ్యాప్ తో బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్, చరణ్ సినిమాలు పోటీపడడం ఖాయం. మరి… ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరిలో ఎవరి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular