Thursday, June 18, 2026
Homeసినిమాచెర్రీ, చైతూ.. అందుకే వెయిట్ చేస్తున్నారా..?

చెర్రీ, చైతూ.. అందుకే వెయిట్ చేస్తున్నారా..?

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య టైటిల్ అనౌన్స్ చేసి రిలీజ్ చేసిన వీడియోకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ కి రిలీజ్ చేసే ఫ్లాన్ లో ఉన్నారు. ఇందులో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తుంటే… ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు చరణ్ బుచ్చిబాబు సానాతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమాని ఓకే చేద్దామనుకుంటున్నారట కానీ.. సరైన కథ దొరకడం లేదని తెలిసింది. ఇటీవల ఒకరిద్దరు దర్శకులు చెప్పిన స్టోరీస్ విన్నారట కానీ.. నచ్చలేదట. ప్రస్తుతం చరణ్ మంచి కథ ఉంటే సినిమా ఓకే చేయడానికి రెడీగా ఉన్నాడు. మరో వైపు చైతూ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కస్టడీ తర్వాత కథల ఎంపికలో ఆలోచనలో పడ్డాడు.

చందూ మొండేటితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు. జులై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేద్దామనుకుంటే కథ సెట్ కావడం లేదు. కిషోర్ తిరుమల చైతూకు కథ చెప్పాడు కానీ.. సెట్ కాలేదు. మరో కథ పై వర్క్ చేస్తున్నాడు. అలాగే ఒకరిద్దరు దర్శకులు కథ చెప్పడం జరిగింది కానీ.. నచ్చలేదు. సో.. చెర్రీ, చైతూ కథల కోసం వెయిటింగ్. మరి.. ఈ ఇద్దరికీ సెట్ అయ్యే కథలతో దర్శకులు మెప్పిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular