Monday, June 15, 2026
HomeసినిమాRam Charan: ఈ సినిమా రంగస్థలంకు మించి ఉంటుంది - చరణ్‌

Ram Charan: ఈ సినిమా రంగస్థలంకు మించి ఉంటుంది – చరణ్‌

రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో చరణ్ నెక్ట్స్ మూవీస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్‌.. ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ మీట్ లో పాల్గొన్న చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. తన కెరీర్ లో ‘రంగస్థలం’ మూవీలోని చిట్టిబాబు క్యారెక్టర్ ది బెస్ట్ అని, అయితే.. దానిని మించేలా మరింత అద్భుతంగా బుచ్చిబాబు మూవీలోని క్యారెక్టర్ ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా.. ఈ సినిమా తప్పకుండా గ్లోబల్ గా ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని కూడా చరణ్ తెలిపారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో.. వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సతీష్ కిలారు, సుకమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలియ‌జేశారు. అయితే.. చరణ్ ఈ సినిమా గురించి చెప్పినప్పటి నుంచి మరింతగా అంచనాలు పెరిగాయి. ఉప్పెన సినిమా తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ సినిమా కథ పైనే వర్క్ చేశాడు. మరి.. చరణ్, బుచ్చిబాబు ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular