Monday, June 15, 2026
Homeసినిమాబాలీవుడ్ డైరెక్టర్ తో చరణ్‌ మూవీ..?

బాలీవుడ్ డైరెక్టర్ తో చరణ్‌ మూవీ..?

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఈపాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 20 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. న్యూజిలాండ్ లో జరిగే ఈ షెడ్యూల్ లో చరణ్, కైరా అద్వానీ పై ఓ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో తర్వాతి డైరెక్టర్ ఎవరనేది ఇంకా తేలలేదు.

ఇదిలా వుంటే చరణ్ తో సుకుమార్ ఓ సినిమాని చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ని ఇదివరకే సుకుమార్ షూట్ చేశాడని ఇటీవలే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీస్ బయట పెట్టిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టు సుక్కుతో చరణ్ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని ఇటీవల వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరితో అంటే.. యాక్షన్ కామెడీ చిత్రాలకు బాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు రోహిత్ శెట్టితో అని టాక్.

ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో ‘రోహిత్ శెట్టి’ సర్కస్ అనే మూవీ చేస్తున్నాడు. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. అయితే.. త్వరలో రామ్ చరణ్ తో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చరణ్ తో కథా చర్చలు జరిగాయి అంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ లో కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular