Thursday, June 18, 2026
HomeTrending Newsఆస్కార్ అవార్డ్ తర్వాత చరణ్‌ రియాక్షన్ ఏంటి..?

ఆస్కార్ అవార్డ్ తర్వాత చరణ్‌ రియాక్షన్ ఏంటి..?

తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా ఆస్కార్ అవార్డ్ దక్కించుకోలేదు. లగాన్ మూవీ ఆస్కార్ వరకు వెళ్లింది కానీ.. సొంతం చేసుకోలేకపోయింది. అలాంటిది తెలుగులో తెరకెక్కిన సినిమా.. తెలుగు పాట ఆస్కార్ అందుకోవడం అంటే.. మామూలు విషయం కాదు. ఇది జరిగింది అంటే.. కారణం.. ఒక్క రాజమౌళినే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆస్కార్ వేదిక పై ‘నాటు నాటు’ అంటూ తెలుగు పాటను ప్రదర్శించడం.. ఆ పాటకు అక్కడవాళ్లు డ్యాన్సులు చేయడం ఇదంతా కల..? నిజమా..? అనిపిస్తుంది అంటున్నారు సినీజనాలు.

ఇంతటి అద్భుతాన్ని అందించిన తర్వాత రామ్ చరణ్‌ రియాక్షన్ ఏంటంటే… ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆర్ఆర్ఆర్ అనేది ఎప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలో స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని… మన జీవితాల్లో కూడా అది పెనమేసుకుపోయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను ఎవరికీ థాంక్స్ చెప్పలేకపోతున్నానని… ఇదంతా ఒక కలలా అనిపిస్తోందని అన్నారు. మీ అందరి సపోర్ట్, ప్రేమ వల్ల ఇక్కడ దాకా వచ్చామని ఆయన పేర్కొన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి గారు, కీరవాణి గారు తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు… ఇండియన్ సినీ పరిశ్రమకు దొరికిన అరుదైన రత్నాలు లాంటివారని పేర్కొన్నారు.

ఇలాంటి ఒక మాస్టర్ పీస్ లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి… ఆయన ఇప్పుడు నాటు నాటు ఎమోషన్ ప్రపంచ వ్యాప్తంగా ఉందని చంద్రబోస్ గారికి అలాగే పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అందరికీ థాంక్స్ చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా థాంక్స్ చెబుతూ సోదరా మనం మళ్ళీ కలిసి డ్యాన్స్ చేస్తాం… చేసి మరిన్ని రికార్డులు బద్దలు కొడతామని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular