Monday, June 15, 2026
Homeసినిమాఅదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన చరణ్‌

అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన చరణ్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. దీంతో రామ్ చరణ్ కు నార్త్ లో మాంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ చరణ్‌ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. దీంతో ఎంతో ఆనందంతో ఉన్నారు చిత్ర బృందం.

ఇక ఈ వేడుకలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌ ఈ సినిమా మేకింగ్ సమయంలో రాజమౌళి తమను ఎంత ఇబ్బంది పెట్టారో చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియాలో  జరిగిన ఈ అవార్డు ప్రధాన ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా  వెరైటీ మ్యాగజిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.  మార్వెల్ స్టూడియోస్ నుండి కాల్ వస్తే మీరేం చేస్తారు అంటూ రాంచరణ్ ను అడగ్గా  తప్పకుండా చేస్తాను అన్నారు. దాంతో పాటు ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సైన్ చేశానని.. 2023లో 3 సినిమాలు, 2024లో 3 సినిమాలు ఓకే చేశాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి మరో సినిమా చేయాలని వుందన్నారు. అయితే.. ఆరు ప్రాజెక్టులు ఓకే చేశాను అని చెప్పడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. ఈ రెండు కాకుండా ఆరు సినిమాలకు ఓకే చెప్పారా..? వీటితో కలిపి ఆరు సినిమాలు అని చెప్పారా..? అనేది తెలియాల్సివుంది. అయితే.. చరణ్‌ ఓకే చెప్పిన ఆరు ప్రాజెక్టులు ఏంటి అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular