Thursday, March 19, 2026
Homeసినిమాసల్మాన్, వెంకీ మూవీలో చరణ్‌

సల్మాన్, వెంకీ మూవీలో చరణ్‌

రామ్ చరణ్‌.. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. దీంతో టాలీవుడ్ స్టార్ కాస్తా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు చరణ్‌ అమెరికా వెళ్లారు. అయితే.. ప్రస్తుతం చరణ్‌.. శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇందులో డబుల్ రోల్ చేస్తుండడం విశేషం. చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్.జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. చరణ్‌ ‘జంజీర్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ బాలీవుడ్ లో మూవీ చేయలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో చరణ్‌ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. ఓ పాటలో సల్మాన్, వెంకీ, పూజా హేగ్డేలతో కలిసి చరణ్ కనిపించనున్నారని సమాచారం. మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయనున్నారు.

చరణ్‌, సల్మాన్ ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ఇటీవల చరణ్ అడగడంతో సల్మాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు సల్మాన్ అడగడంతో చరణ్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. సల్మాన్, వెంకీ, చరణ్ కనిపించే పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా పై సల్మాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ సినిమా సల్మాన్ కు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular