Sunday, January 19, 2025
HomeసినిమాCharan- Buchi Babu Sana: చరణ్‌ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా..?

Charan- Buchi Babu Sana: చరణ్‌ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా..?

రామ్ చరణ్ ప్రస్తుతం  డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఇది నిర్మాణం కానుంది. ఇది స్పోర్ట్స్ డ్రామా అని, చరణ్‌ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంపై చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్‌ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపధ్యంలో సాగే కథ. అందుచేత చరణ్ ఉత్తరాంధ్ర యాసలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది.  తన బాడీ లాంగ్వేజ్‌ పై కూడా ఫోకస్ చేయనున్నారు. స్టోరీ, చరణ్‌ క్యారెక్టర్ మొత్తం చాలా వైవిధ్యంగా ఉంటుందట.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. రంగస్థలంలో గోదారి యాసతో ఆకట్టుకున్న చరణ్‌ ఇప్పుడు ఉత్తరాంధ్ర యాసతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్