Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మెగాభిమానులకు ఓ గుడ్ న్యూస్…  ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఓ శుభవార్తను వారు నేడు అందుకున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు, ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హనుమంతుడి ఆశీస్సులతో … ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు త్వరలో తొలి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు’ అంటూ ప్రకటించారు.

చిరంజీవి-సురేఖ తో పాటు ఉపాసన తల్లిదండ్రులు శోభన-అనిల్ కామినేని దంపతుల పేర్లతో కూడిన ఈ ప్రకటన ను చిరు షేర్ చేశారు.

 2012 జూన్ 14న రామ్ చరణ్- ఉపాసనల వివాహం  జరిగింది.  చరణ్ ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఉపాసన అపోలో ఆస్పత్రి అనుబంధ సంస్థ అపోలో ఫౌండేషన్ మెంబర్ గా, అపోలో ఆస్పత్రి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సిఎస్ఆర్) విభాగానికి వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com