Sunday, January 19, 2025
Homeసినిమాచిరంజీవి మనవరాలు పేరు క్లీంకార

చిరంజీవి మనవరాలు పేరు క్లీంకార

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టింది. ఈ వార్త మెగా ఫ్యామిలీలో పండగ తీసుకువచ్చింది. ఈరోజు ఆ చిన్నారికి బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్, ఉపాసనల కలల పంట అయిన ఆ పాపకు తెలుగు సంప్రదాయాల ప్రకారం ఉయ్యాలలో వేసి నామకరణం కూడా చేశారు. తన మనవరాలి పేరు క్లీంకార అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అంతే కాకుండా.. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నామని తెలిపారు.

మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని చిరంజీవి వివరించారు. ఈ పేరులోని లక్షణాలను తమ చిన్నారి ఎదిగేకొద్దీ తన వ్యక్తిత్వంలో ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా క్లీంకారకు ఆశీస్సులు అందచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్