Tuesday, April 16, 2024
Homeసినిమా'రుద్రంగి' తప్పకుండా విజయం సాధిస్తుంది -  బాలకృష్ణ

‘రుద్రంగి’ తప్పకుండా విజయం సాధిస్తుంది –  బాలకృష్ణ

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరియర్ లో దూసుకు వెళుతున్న జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘రుద్రంగి’ అనే సినిమాతో జగపతిబాబు త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మమత మోహన్ దాస్, విమల రామన్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా నందమూరి బాలకృష్ణ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… నాకు రస్మయి గారికి రాజకీయాలు తెలియవు. కానీ మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో వచ్చాం. రుద్రంగి లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మా నాన్నగారు అలాంటి సినిమాలు చాలా చేశారు. ఇప్పుడు జగపతి బాబు అలాంటి సినిమా చేస్తూ ఉండడం చాలా సంతోషం గా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసమే మేము ఇంకా పని చేస్తున్నాం. మమత మోహన్ దాస్ ఒక వీర వనిత. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా నాకు తెలుసు.. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంత క్షోభ పడతారు అని.. కానీ ఆమె చాలా ధైర్యంగా ఉండి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాదిస్తుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్