Thursday, June 18, 2026
HomeసినిమాRam Charan: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చరణ్ లుక్

Ram Charan: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చరణ్ లుక్

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో చరణ్‌ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ చరణ్‌ ను ఎలా చూపించనున్నారు..? అసలు కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చరణ్ డబుల్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ రెండు పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చరణ్ ఇప్పుడు శంకర్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చరణ్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఇపుడు చరణ్ పిక్ అయితే ఒకటి బయటకి వచ్చింది. ఇందులో తన హెయిర్ స్టైల్ గాని మెడలో ఓ తాడు లాంటిది డ్రెస్సింగ్ అంతా సినిమాలో ప్రిపేర్ చేసినదే అన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. దీనితో డైనమిక్ గా కనిపిస్తున్న ఈ లుక్ ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది. ఖచ్చితంగా తమ హీరోతో శంకర్ మాస్ సంభవం చూస్తామని గట్టిగా మెగా ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు.

ఇక ఈ మార్చి 27 న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సెన్సేషనల్ కాంబో నుంచి టైటిల్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సేనాని, సేనాపతి, సైనికుడు, సీఈఓ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. చరణ్‌, శంకర్  కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : Chiranjeevi: బ్రహ్మానందంను ప్రత్యేకంగా సత్కరించిన చిరంజీవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular